Royal Enfield Classic 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 క్రేజీ లుక్స్.. చూస్తే మతిపోతది
2024 Royal Enfield Classic 350: క్రేజీ లుక్స్.. అద్భుతమైన ఫీచర్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో మోడల్ దిగుతోంది. సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌కు సంబంధించిన ఫొటోలు చూసేయండి. చూసతే మతిపోతది.
2024 Royal Enfield Classic 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాల్లో ముఖ్యమైన అప్‌గ్రేడ్ మొత్తం ఎల్‌ఈడీ లైటింగ్ విధానం ఉంటుంది. హెడ్‌లైట్, పైలట్ లైట్లు, సూచికలు, టెయిల్‌లైట్ ఇలా అన్నీ కూడా ఈ మోడల్‌లో ఎల్‌ఈడీ ఉంటాయి. అదనంగా టైప్-సీ యూఎస్‌బీ ఛార్జర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటివి ఈ మోడల్‌లో వచ్చాయి.
2024 Royal Enfield Classic 350: ఇది అనలాగ్ స్పీడోమీటర్, చిన్న ఎల్‌సీడీ స్క్రీన్‌తో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఎల్‌సీడీ స్క్రీన్‌లో ఇంధన స్థాయి, ఓడోమీటర్ రీడింగ్, ట్రిప్ డేటా వంటి ముఖ్యమైన సమాచారం కనిపిస్తుంది. రైడర్లు ట్రిప్పర్ నావిగేషన్ పాడ్‌ని కూడా ఎంచుకోవచ్చు. టర్న్-బై-టర్న్ డైరెక్షన్‌లు, ఫోన్ కాల్ అలర్ట్‌లను అందిస్తాయి.
2024 Royal Enfield Classic 350: ఈ వాహనం ఐదు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది. ఐదు థీమ్‌లుగా విభజించారు: క్రోమ్, మాటే, హల్కీన్, సిగ్నల్స్, రెడ్డిచ్. రంగుల పాలెట్‌లో మద్రాస్ రెడ్, జోధ్‌పూర్ బ్లూ, ఎమరాల్డ్, మెడలియన్ బ్రౌన్, స్టెల్త్ (నలుపుపై నలుపు), కమాండో రంగుల్లో ఉన్నాయి.
2024 Royal Enfield Classic 350: ఇంజిన్ సెటప్ యథావిధిగా ఉంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 349 సీసీ. సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో ఈ వాహనం వస్తోంది. ఈ సెటప్ 20బీహెచ్‌పీ శక్తిని, 27ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. సస్పెన్షన్ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు ట్విన్ గ్యాస్-ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.
2024 Royal Enfield Classic 350: ఒకే ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లు వస్తున్నాయి. అధిక ట్రిమ్‌లు వెనుక డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌లను అందిస్తున్నారు. ఈ మోడల్ ధర రూ.1.93 లక్షల నుంచి రూ.2.2 లక్షల మధ్య ఉండవచ్చు. రంగు ఇతర ఫీచర్లను బట్టి ధరల్లో మార్పు ఉండవచ్చు.